ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రెండు రోజులుగా ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని కొద్దిసేపటి కింద బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్‌కు తరలించారు.

ఉదయం నుంచి అశ్వత్థామరెడ్డితో పోలీసులు చర్చలు జరిపారు. అయితే ఆయన మాత్రం దీక్ష విరమించనని తేల్చి చెప్పారు. అశ్వత్థామరెడ్డితో పాటు మరో 20 మంది మహిళా కార్మికులు కూడా దీక్ష చేస్తున్నారు. వాళ్లందరికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి హెల్త్ కండీషన్ బాగోలేదని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు వారందరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Latest Updates