కోర్టు చివాట్లు పెట్టినా ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరి మారలేదు: అశ్వత్థామ రెడ్డి

కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వ వైఖరి మారలేదని అన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సీఎం కేసీఆర్ ఇచ్చిన అఫిడవిట్ గా ఉందని అన్నారు. సునీల్ శర్మ కు ఆర్టీసీ పై పూర్తి అవగాహన లేదని తెలిపారు. ఆయన ఆర్టీసీ ఎండీ అయి 17నెలలే అయిందని… అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదని చెప్పారు. సమ్మె లీగలా ఇల్లీగలా కోర్టు తేలుస్తుందని అన్నారు. ట్యాంక్ బండ్ పై దెబ్బలు తిన్నది తమ సిబ్బందేనని తెలిపారు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్ పై ఎండీ సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని.. అది ఫక్తూ రాజకీయ అఫిడవిటేనని చెప్పారు.

Latest Updates