పరిష్కారం దొరికేవరకు సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, ఉద్యోగులు చొరవచూపాలన్న హైకోర్టు సూచనలపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పందించారు. “ప్రభుత్వంతోకానీ… యాజమాన్యంతో కానీ చర్చలకు పిలిస్తే సిద్ధంగా ఉన్నాం. కోర్టు ఆదేశాలను పాటిస్తాం. చర్చలకు పిలిస్తే వెళ్తాం. సమ్మెను విరమించాలని మాకు మాత్రమే చెప్పలేదు. కోర్టు ఇరుపక్షాలకు సూచనలు చేసింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ప్రభుత్వం మాట్లాడితే మీరు కూడా సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉండండి అని కోర్టు చెప్పింది. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం చర్చలకు పిలవకుండా సమ్మె విరమించాలంటే మాత్రం అది జరిగే పనికాదు. పరిష్కారం దొరికేవరకు సమ్మె కొనసాగుతుంది” అని అశ్వత్థామ రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని.. కేకే కమిటీలాంటి ఏ కమిటీతోనూ తాము చర్చలు జరపలేదని అన్నారు అశ్వత్థామ రెడ్డి. ప్రభుత్వంపై స్పందన వచ్చేవరకు.. సమ్మె మాత్రం కొనసాగుతుందని చెప్పిన అశ్వత్థామ రెడ్డి… 18న మళ్లీ కోర్టుకు వస్తామన్నారు. సమ్మె ఇప్పటికిప్పుడు విరమించే ప్రసక్తే లేదని చెప్పారు.

Latest Updates