ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్టులు

రేపటి చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తోపాటు జిల్లాల్లోనూ ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. యూనివర్సిటీల్లోనూ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. కొందరు కార్మికుల ఇళ్లలోకి వెళ్లి మరీ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డిని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న వాహనంలో వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్టులపై మండిపడుతున్నారు జేఏసీ నేతలు.

Latest Updates