రేపే సమ్మెపై తుది నిర్ణయం : అశ్వత్థామరెడ్డి

ఉస్మానియా ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేపట్టిన ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరపించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు ప్రతిపక్ష పార్టీలు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ కోర్ట్ తీర్పు అనంతరం సమ్మెపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కోర్ట్ ను తీర్పును గౌరవించి మంగళవారం తలపెట్టిన సడక్ బంద్, రాస్తారోకో ను వాయిదా వేసినట్ల చెప్పారు. రేపు ఉదయం సమ్మెపై కేంద్ర యూనియన్ల కమిటీ సమావేశం జరుగుతుందని, సాయంత్రం సమ్మెపై తుదినిర్ణయం ప్రకటిస్తామన్నారు. కోర్ట్ ఉత్తర్వుల అనంతరం భవిష్యత్ కార్యచరణ చేపడతామని చెప్పారు.

వైద్యుల సూచనలతో దీక్షను విరమణ. కోదండరామ్ 

కోర్ట్ తీర్పు, జేఏసీ నేతల మధ్య నిరాహార దీక్షను విరమించినట్లు కోదండరామ్ అన్నారు. రెండు రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులందరూ సమ్మెపై చర్చించినట్లు తెలిపారు. జేఏసీ నేతల ఆరోగ్య రిత్యా  నిరాహార దీక్ష ప్రమాదమని వైద్యులు చెప్పడంతో దీక్షపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండ రామ్ చెప్పారు.

Latest Updates