బంద్ సంపూర్ణం.. ఆర్టీసీ జేఏసీ ప్రకటన

డిమాండ్ల సాధన పోరాటంలో భాగంగా తాము ఇచ్చిన బంద్ పిలుపు సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు జేఏసీ నాయకులు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఆర్టీసీ బంద్ పిలుపుతో రోడ్డెక్కిన ఉద్యోగులు, కార్మికులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ పేరుతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించింది ఆర్టీసీ. అరెస్ట్ చేసే క్రమంలో వారిపై భౌతిక దాడులకు దిగడాన్ని తప్పుపట్టింది. అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. 

Latest Updates