కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేం.. ఫైనల్ అఫిడవిట్ అంశాలివే..

కార్మికుల సమస్యలను పరిష్కరించలేమంటూ  హైకోర్టులో ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేశారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని  చెప్పారు. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి బాగలేదని.. వారి ఆర్ధిక పరమైన డిమాండ్లు కూడా నెరవేర్చలేమన్నారు. సమ్మె కారణంగా ఇప్పటి వరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టం వాటిల్లిందన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు  కూడా జరపలేమన్నారు. యూనియన్ నేతలు విలీనం డిమాండ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టినా.. ఏ క్షణం అయినా మళ్లీ ఆ డిమాండ్ తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆవకశం ఉందన్నారు.

కొంత మంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం  ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని అన్నారు. కార్మికుల కోసం కాకుండా.. యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని అన్నారు. అలాంటి సమ్మె ను ఇల్లీగల్ అని ప్రకటించాలని కోరుతున్నామని కోర్టులో చెప్పారు ఎండీ. యూనియన్ లీడర్లు ప్రతిపక్షాలతో చేతులు కలిపి  ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అఫిడవిట్ లో తెలిపారు ఎండీ.

Latest Updates