ఆరో రోజు ఆర్టీసీ సమ్మె : అడుగడుగునా ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా  ఆర్టీసీ కార్మికుల  సమ్మె  ఆరవ  రోజుకు  చేరుకుంది. కార్మికుల  డిమాండ్లపై  సర్కార్ దిగిరాకపోవటంతో….సమ్మెను  ఉధృతం  చేయాలని నిర్ణయించారు  కార్మికులు. ఇవాళ  బస్ డిపోల ముందు…ఆందోళనలు,  నిరసలు,  ధర్నాలు చేయాలని  పిలుపునిచ్చారు. కార్మికుల సమ్మెకు  మద్దతు తెలిపిన  అఖిలపక్షం నేతలు… నిరసనలో  భాగంగా  తహసీల్దార్లకు  వినతి  పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

మరోవైపు ఈ నెల  19న తెలంగాణ బంద్ పై  ఇవాళ  నిర్ణయం తీసుకోనుంది  అఖిలపక్షం. ఆర్టీసీ  సమ్మె  పిటీషన్లపై హైకోర్టులో  విచారణ జరగనుంది.  సమ్మెపై  కౌంటర్ దాఖలు   చేయనుంది సర్కార్.  అటు పండగ  ముగియంతో తిరుగు ప్రయాణం  అవుతున్నారు  ప్రజలు . దీంతో  ఎక్కువ ఛార్జీలు  వసూల్ చేయవద్దని  ఆదేశాలు జారీ  చేసింది సర్కార్. బస్సుల్లో  పాసులు కూడా  నడుస్తాయని  తెలిపింది. ఫిర్యాదుల  కోసం  కంట్రోల్ రూంను  ఏర్పాటు చేయలని నిర్ణయించింది.

Latest Updates