సమ్మె సమయంలో సూసైడ్ అటెంప్ట్.. ఆర్టీసీ కార్మికుడు మృతి

సమ్మె సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఆర్టీసీ కార్మికుడు (మెకానిక్)  షేక్ బాబా మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి రెండు గంటలకు మృతి చెందాడు.

సికింద్రాబాద్ రాణిగంజ్ వన్ డిపోకు చెందిన షేక్ బాబా నవంబర్ 5న పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి సుచిత్ర రేస్ ఆస్పత్రిలో చికిత్స పొందిన షేక్ బాబా..ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటీవల గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. తొమ్మిది సంవత్సారాలుగా రాణిగంజ్ వన్ డిపోలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు షేక్ బాబా. మేడ్చల్  కు చెందిన షేక్ బాబాకు భార్యా ఇద్దరు  పిల్లలు ఉన్నారు. షేక్ బాబా మృతితో కుటుంబ సభ్యులతో పాటు  ఆర్టీసీ కార్మికులు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Latest Updates