ఆర్టీసీ కార్మికులు కొత్త కోరికలు కోరడం లేదు: తమ్మినేని

సీఎం కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆర్టీసీ కార్మికులది చారిత్రాత్మక సమ్మె అన్నారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న తమ్మినేని…కార్మికుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. సమ్మె విషయంలో సీఎం అబద్దాలు చెబుతున్నారని..కార్మికులు సమ్మె చేయవచ్చని చట్టంలో ఉందన్నారు. కార్మికులు నీ కింద పాలేర్లు కాదన్నారు. వారు కొత్త కోరికలు ఏమీ కోరడం లేదని…సీఎం చెప్పిన వాటినే అడుగుతున్నారని చెప్పారు. సీఎంకు…ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు తమ్మినేని వీరభద్రం.

 

Latest Updates