కేసీఆర్ మృతిచెందాడంటూ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ నిరసన

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు  వినూత్న రీతిలో ప్రభుత్వంపై  తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ముందు బైటాయించి ధర్నాకు దిగిన ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన చేశారు. సీఎం కేసీఆర్ మృతిచెందడంటూ శవం పక్కన కూర్చొని ఏడుస్తూ ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పై సీఎం అవలంభిస్తున్న తీరుతో విసుగుచెందామని, 40 రోజులుగా నిరసనలు చేస్తున్న పట్టించుకోకపోవడంతో కేసీఆర్ చనిపోయినట్టు ఒక కార్మికుడిని పడుకోబెట్టి తోటి కార్మికులు చుట్టూ కూర్చొని ఏడుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

Latest Updates