ఆర్టీసీ సమ్మె: రోడ్లపై వంటావార్పు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్‌లోని JBS దగ్గర ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేందుకు ఆటోలను, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

Latest Updates