ప్రైవేట్ డ్రైవర్లకు దండేసి దండం పెట్టిన కార్మికులు

  • తమ జీవితాలురోడ్డు పాలు చేయొద్దంటూ
  • కాంట్రాక్టు డ్రైవర్లకు కార్మికుల విన్నపం

మహేశ్వరం, వెలుగు: తాత్కాలికంగా బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు పూల దండలు వేసి ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. మహేశ్వరం ఆర్టీసీ డిపో కార్మికులు మహేశ్వరం నుంచి తుక్కుగూడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తాత్కాలికంగా బస్సులు నడిపిస్తున్న డ్రైవర్లకు పూలదండ వేసి మర్యాదపూర్వకంగా తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దని సమ్మె చేస్తున్న కార్మికులు అభ్యర్థించారు. ఇందులో  ఆర్టీసీ జేఏసీ నాయకులు శంకర్​, మల్లేష్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు,​ ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Latest Updates