ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయాలి 

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయాలి 

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ లో ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.  సోమవారం ఆయ‌న సూర్యాపేట‌ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి కోవిడ్ వార్డులో పర్యటించి కరోనా బాధితులతో  వారికి అందుతున్న ట్రీట్ మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఉత్తమ్  మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం  రాష్ట్రంలో కరోనా పరీక్షలను తగ్గించడం బాధాకరమన్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో కొన్నిచోట్ల ఫ‌లితాలు స‌రిగ్గా రావ‌డంలేద‌ని.. దీంతో క‌రోనా బాధితులు అయోమ‌యానికి గుర‌వుతున్నార‌ని చెప్పారు. సూర్యాపేట మెడికల్ కాలేజీని 950 పడకల పీజీ కాలేజీగా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ ఆస్పత్రులకు మినరల్ ఫండ్ నిధులతో సీటీ స్కాన్, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లైన్స్ , ఐసీయూ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.