కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి..రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి..రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి/వీపనగండ్ల.వెలుగు:  రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వీపనగండ్ల మండల కేంద్రంలో 30 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు చెక్కుల కోసం ఎవరికీ ఒక్క నయాపైసా కూడా ఇవ్వొద్దని సూచించారు.

 అల్ప వర్షపాతం కారణంగా రైతులు సాధారణ పంటలకు బదులుగా ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, మండలంలోని 14 గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో సర్పంచులు మీసాల పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.