రగ్బీ ప్లేయర్‌‌కు సర్జరీ: ముఖంలో 20 నట్లు ఫిక్స్‌ చేసిన డాక్టర్లు

  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ప్లేయర్‌‌

రగ్బీ స్టార్‌‌ ప్లేయర్‌‌ సియా సోలియోలా ముఖానికి దెబ్బతగలడంతో డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. ముఖంలో 20 నట్లు బిగించి ఆపరేషన్‌ చేసి సెట్‌ చేశారని ఆటగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ముఖ పగుళ్లతో బాధపడుతున్నప్పటికీ ఆయన తన పరిస్థితిని హాస్యంగా వివరించి నవ్వించారు. 20 స్క్రూలతో ఉన్న ఎక్స్‌రే ఫొటోను షేర్‌‌ చేశారు. సుత్తి, మేకులు ఉన్న ఎమోజీస్‌ను జత చేసి పోస్ట్‌ చేశారు. ఈ క్రెడిట్‌ అంతా డాక్టర్స్‌దే అని అన్నారు. గత శుక్రవారం సెయింట్‌ జార్జ్‌ ఇల్లావర్రా డ్రాగన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో దెబ్బ తగిలింది. అయితే అతను కోలుకునేందుకు మూడు నెలలు పడుతుందని కోచ్‌ రికీ స్టువర్ట్‌ చెప్పారు.

Latest Updates