అరే దేఖో యారో బాలయ్య స్టైల్

KS రవి కుమార్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా రూలర్. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ సాయిచ‌ర‌ణ్ భాస్కరుని పాడిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ని విఫరీతంగా ఆకట్టుకుంటోంది.

హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యాకెక్టర్స్ లో నటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న రూలర్.. డిసెంబర్‌ 20న రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో నుంచి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తుంది యూనిట్. ఇటీవల వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇవాళ రిలీజైన లిరికల్ సాంగ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయంటున్నారు ఫ్యాన్స్.

Latest Updates