రూలింగ్‌‌ పార్టీకి బుగులు మొదలైనట్టే

టీఆర్ఎస్‌‌కు కౌంట్ డౌన్ షురూ

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లో  టీఆర్ఎస్, బీజేపీకి మధ్య తేడా గట్టిగా పది సీట్లు కూడా లేదు. రేపు సారు తన దోస్త్ తో కలిసి ఒప్పందం చేసుకుని మేయర్ పీఠం సొంతం చేసుకున్నా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సర్కార్ తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చింది. గాలిలో కోటలు కట్టడం కాదు.. నిజమైన అభివృద్ధి చేసి కళ్లకు చూపించాలని జనం గట్టిగా చెప్పి రూలింగ్ పార్టీ గర్వాన్ని దించారు.

లోకల్ బాడీ ఎలక్షన్ అంటే అధికార పార్టీకే జనం ఓటేస్తారు. పైగా పోలింగ్ 50 శాతం కూడా దాటలేదు కాబట్టి గెలుపు వన్ సైడ్ గా ఉంటుంది. బీజేపీ గెలిస్తే మత కలహాలు జరుగుతాయంటూ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా పోయింది. రోడ్లు, ఫ్లైఓవర్లు, కంపెనీలు అన్న క్యాంపెయిన్ కలిసొచ్చి టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం’ అని రూలింగ్ పార్టీ వేసుకున్న అంచనాలన్నీ తిరగబడ్డాయి. మోసపు మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని జీహెచ్ఎంసీ తీర్పుతో గట్టిగా చెప్పారు. ఇన్నాళ్లు స్ట్రాంగ్ గా నిలబడే ప్రత్యర్థి లేకనే టీఆర్ఎస్ కు ఓటేస్తూ వచ్చారా అన్న బుగులు అధికార పార్టీలోనే పుట్టించారు ప్రజలు.

గ్రేటర్ ఎన్నికలు ఏదో కార్పొరేషన్ ఎలక్షన్ లా జరగలేదు. ప్రభుత్వాన్నే మార్చేసే ఎన్నికలా అన్నట్టుగా హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల ప్రచారం కూడా అలానే సాగింది. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మధ్య యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా నడిచింది. రెండు పార్టీలు అంతే కసిగా పని చేశాయి. దుబ్బాక విజయంతో ఊపు మీదున్న బీజేపీ.. గ్రేటర్ హైదరాబాద్ ను సొంతం చేసుకోవాలని కష్టపడింది. దుబ్బాకలో ఎలాగైతే బీజేపీ నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా.. రూలింగ్ పార్టీ విషప్రచారాన్ని ఎదుర్కొంటూ, పోలీసుల కేసులను లెక్క చేయకుండా ప్రజల్లోకి చొచ్చుకుని పోయారో.. అలాగే గ్రేటర్ లోనూ ట్రై చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీఆర్ఎస్ ఆరున్నరేండ్లుగా చేసిందేమీ లేదన్న విషయాన్ని విడమరచి చెప్పారు. పక్కా స్ట్రాటజీ, ఫోకస్ తో ఉత్తర భారతంలో ఎలా సత్తా చాటుకుంటోందో అలానే ఇక్కడా పాగా వేసే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. 2016 గ్రేటర్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ గెలుచుకున్న 99 సీట్లలో ఎన్ని తక్కువ చేయగలిగితే అంత సక్సెస్ అయినట్లు అని భావించి బీజేపీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. టీఆర్ఎస్ దోస్త్ అయిన ఎంఐఎంను.. దోస్త్ కాదు దుష్మన్ అని ఆ పార్టీ చేతనే చెప్పించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దోస్తీనా లేక ఎనిమీనా తేల్చుకోలేకుండా రెండు పార్టీల క్యాడర్ ను అయోమయంలోకి నెట్టేసింది.

ఆరున్నరేండ్లలో చేసిందేంటని ఆలోచించి జనం ఓటు

నిజాం పాలించిన గడ్డలో మత కలహాలు సృష్టిస్తారంటూ బీజేపీపై ఎటూ కాని నిందలు వేసి గెలవాలని రూలింగ్ పార్టీ ఎత్తులు వేసింది. కానీ టీఆర్ఎస్ ఆగడాలు, బాగోతాలను జనంలో పెట్టింది బీజేపీ. దుబ్బాక ప్రజల్లాగే గ్రేటర్ లో కూడా జనం ఆలోచించి ఓటేశారు. ఆరున్నరేండ్లుగా టీఆర్ఎస్ చేసిందేంటి? సిటీలో చేసిన డెవలప్ మెంట్ ఏంటి? మెట్రో పాత బస్తీలోంచి ఎందుకు పోలేదు? మనకు అసలు ఒక తీరు తెన్నులేని అభివృద్ధి పేరు చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ వరదల్లో సిటీ మునగకుండా ఎందుకు ఆపలేకపోయింది? విశ్వనగరం చేస్తామని చెప్పి ఇన్నేండ్లయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయలేకపోవడమేంటి? అని ప్రజలు ఓటేసే ముందు ఆలోచించారు. తమను వరదల్లో ముంచేసిన రూలింగ్ పార్టీని ఓటుతో తొక్కేశారు. అసలు సిట్టింగ్ కార్పొరేటర్లు ఓట్లు అడుగుతున్నప్పుడే ప్రజలు నిలదీస్తున్న సమయంలోనే టీఆర్ఎస్ కు ఈ విషయం అర్థం కావాల్సింది. ప్రజలకు పనికి రాని పిచ్చి పథకాలు కాదు.. కావాల్సింది నిజమైన అభివృద్ధి అని తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మళ్లీ సారుకు ఆ దోస్త్ (ఎంఐఎం) అవసరం కనిపిస్తుంది. గ్రేటర్ పీఠం కోసం ఆ దోస్త్ ఎంత వరకు కలిసొస్తాడో చూడాలి.

బలంగా ఢీ కొట్టే ప్రత్యర్థి కోసమే..

2016లో ఉన్న కారు జోరు పూర్తిగా చల్లారిపోయిందని ఈ ఫలితాలు చూస్తేనే తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, తమకు మంచి చేయడంలేదన్న కోపం ప్రజల్లో కనిపించింది. మాటలతో మాయ చేస్తే ఎంతో కాలం మోసపోవడం జరగదని ఓట్లతో జవాబు చెప్పారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఢీకొట్టే సరైన ప్రత్యర్థి లేకనే ఆ పార్టీ నేతలు చెప్పిందల్లా చెల్లుతూ వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల ముందు నుంచి బీజేపీ రాష్ట్రంలో దూకుడు పెంచింది. దక్షిణాదిపై పట్టుసాధించే పనిలో తెలంగాణను తమ కోటగా మార్చుకోవాలని కష్టపడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ నువ్వా నేనా అంటూ కేసీఆర్ పైనే యుద్దం ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు పెద్ద దిక్కు అంటూ ఇచ్చిన బిల్డప్ అంతా గాలి మాటలే అని జనానికి క్లారిటీ వచ్చేలా చేశారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ కు బలమైన ఆల్టర్ నేటివ్ బీజేపీనే అని ప్రజలు నమ్మేలా నిరంతరం ప్రభుత్వం చేసే తప్పులను వారి ముందుంచారు. దీంతో జనం కూడా ‘ఒక్క చాన్స్’ అన్న బీజేపీ నినాదానికి అట్రాక్ట్ అయ్యారు.

రచనా రెడ్డి, అడ్వోకేట్

For More News..

నేను పవర్​ చేపట్టాక 100 రోజులు మాస్క్

35 వేల జాబులకు కోటి మంది పోటీ

Latest Updates