ఫలితాలపై తప్పుడు ప్రచారం : ఇంటర్ బోర్డు

హైదరాబాద్:  తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ కు ముందే ఇంటర్‌ స్టూడెంట్స్ భవిష్యత్ తేలనుంది. ఏప్రిల్‌ 8న ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రానున్నాయని..కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఇంకా ఫలితాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది ఇంటర్ బోర్డు.

ఈ క్రమంలోనే గురువారం ఇంటర్ బోర్డు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. వాట్సప్‌ లో ఇంటర్ ఫలితాలపై కొన్ని రోజులుగా అసత్య ప్రచారం జరుగుతోంది. మాజీ కంట్రోలర్ సంతకంతో వాట్సప్‌ లో షేర్ అవుతున్న ఆ ప్రకటనను ఎవరూ నమ్మవద్దు. ఇంటర్ ఫలితాల ప్రకటన తేదీని ఇంటర్ బోర్డు ఇంతవరకు ప్రకటించలేదు. ఫలితాల ప్రకటన తేదీని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పేషి ద్వారా కానీ.. ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కానీ ప్రకటించడం జరుగుతుంది.

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఇంకా కొనసాగుతోంది. మూల్యాంకనం తర్వాత ట్యాబులేషన్ పనులు నిర్వహించాలి. అవన్నీ పూర్తయ్యాకనే పరీక్షల ఫలితాల తేదీని ఇంటర్ బోర్డు ప్రకటిస్తుంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏ వార్తనూ నమ్మవద్దని బోర్డు తెలిపింది. త్వరలోనే పలితాల డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తెలిపింది ఇంటర్ బోర్డు.

Latest Updates