పాక్ కు అనుకూలంగా నినాదాలు చేశారంటూ రూమర్స్

ఉత్తరాఖండ్ లో చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులు భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా స్థానిక స్టుడెంట్స్ చేసిన ర్యాలీలో పాకిస్తాన్ కు అనుకూలంగా ఓ హాస్టల్ కు చెందిన కశ్మీర్ విద్యార్థినిలు నినాదాలు చేశారని సొషల్ మీడియాలో రూమర్స్ వ్యాపించాయి. దీంతో అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. భారత్ కు వ్యతిరేకంగా.. పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసినట్టు ఆదారాలు లభించలేదని అశోక్ కుమార్ తెలిపారు.

ఉత్తరాఖండ్ లో చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులు హాస్టల్ రూం లకు బయట నుండి తాలాలు వేసుకుని ఉన్నట్టు తెలిపారు పోలీసులు. కశ్మీర్ విద్యార్థులు భయపడొద్దని వారికి రక్షణగా పోలీసులు ఉన్నారని తెలిపారు.

Latest Updates