ముహూర్తం కుదిరిందా..?

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టే హాట్ టాపిక్స్‌ లో నయనతార పెళ్లి ఒకటి. కొం తకాలంగా నయన్‌ .. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌గా వీరిద్దరూ గ్రీస్‌ పర్యటనకు వెళ్లడం, అక్కడి ఫొటోల్ని పోస్ట్ చేయడంతో వీరి మధ్య అనుబంధం ఉన్న సంగతి కన్ ఫామ్ అయ్యింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌ లో జోరుగా వినిపిస్తోంది.

ఇప్పటికే వీళ్ల ప్రేమకి కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. చాలా రోజులుగా మంచి ముహూర్తం కోసం ఎదురుచూసిన రెండు కుటుంబాల వారూ ఈ ఏడాది డిసెంబర్‌ లో పెళ్లి చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 25న విదేశాల్లో నయన్, విఘ్నేష్‌ ల వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారట. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో అట్టహాసంగా జరగబోయే వీరి వివాహానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ సెలెబ్రిటీస్ అందరూ రానున్నారంటూ తమిళనాట వార్తల మీద వార్తలు వస్తున్నాయి . అయితే నయన్ సాధారణంగా వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడదు. అందుకే ఈ విషయంలోనూ మౌనంగానే ఉంది. సినిమా పనుల్లో మునిగిపోయింది. ప్రస్తుతం రజనీకాంత్‌ తో ‘దర్బార్’, విజయ్‌ తో ‘బిగిల్’ చేస్తోంది. చిరంజీవితో నటిం చిన ‘సైరా’ అక్టోబర్‌ 2న విడుదల కానుంది. మరి ఈ వార్తల విషయమై ఆమె ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.