తప్పిపోయిన కుక్క పోలీస్ స్టేషన్‌కు వచ్చి..

టెక్సాస్ : కుక్కకు మనిషి కంటే విశ్వాసం ఎక్కువ అంటారు. ప్రస్తుత జనరేషన్ లో మనుషులతో పాటు అవి కూడా అప్డేట్ అవుతున్నాయి. కుక్కలకూ మనుషులకు ఉండే తెలివితేటలు ఉంటాయని తెలిపే ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ నెల 11న టెక్సాస్ లో ఓ కుక్క పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇంటి నుంచి తప్పి పోయానంటూ సైగల ద్వారా తెలిపింది. ఆశ్చర్యపోయిన పోలీసులు కుక్క ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో యజమాని పోలీసులను సంప్రదించి కుక్కను తీసుకెళ్లారు.

షాపింగ్ చేసి తిరిగి వచ్చే క్రమలో తమ కుక్క తప్పి పోయిందని.. అయితే ఒక్క రోజులోనే సోషల్ మీడియాలో కుక్క ఫొటో కనిపించడంతో ఆశ్చర్యపోయామని తెలిపాడు యజమాని. కుక్కనే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేశాడు. తమ ఫ్యామిలీలో అందరికి కుక్క అంటే ఎంతో ప్రాణమని చిన్న చిన్న పనులు కూడా చేస్తుందని చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతుండటంతో కుక్క తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Latest Updates