బీల్ చెస్ టోర్నీలో రన్నరప్ హరికృష్ణ

న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ.. బీల్ చెస్ ఫెస్టివల్ క్లాసికల్ టోర్నమెంట్లో  రన్నరప్ గా నిలిచాడు. బుధవారం జరిగిన ఆఖరిదైన ఏడో రౌండ్ లో హరి 31 ఎత్తుల వద్ద అంటోన్ గుజారో డేవిడ్ (స్పెయిన్ )పై గెలిచాడు. దీంతో ఐదున్నర పాయింట్లతో తెలుగు గ్రాండ్ మాస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్ టోర్నీలో హరికృష్ణ 56 రౌండ్లకు 36.5 పాయింట్లు సాధించాడు. రొడాస్లావ్ 37 పాయింట్లతో టాప్ లో నిలిచాడు.

డేవిడ్ తో జరిగిన గేమ్ లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ… గేమ్ మధ్యలో డిఫెన్సు వ్యూహంతో ముందుకెళ్లాడు. కీలక టైమ్ లో డేవిడ్ కు హరిని నిలువరించే అవకాశం ఉన్నా అడ్డు కోలేకపోయాడు. ఇక ఎండ్ గేమ్ లోనూ తెలుగు ప్లేయర్ అద్భుతమైన ఎత్తులతో అలరించాడు. ఇతర గేమ్ ల్లో మైకేల్ ఆడమ్స్ 86 ఎత్తుల వద్ద నైడిట్చ్ అర్కాడిజ్ పై, ఎడ్వర్డ్​ రొమెన్ 38 ఎత్తులతో కీమర్ విన్సెంట్ పై, రొడాస్లావ్ 59 ఎత్తులతో స్టుడెర్ నోయల్ పై గెలిచారు. ఆడమ్సు 35.5, విన్సెంట్ కీమర్ 28, అర్కాడిజి 22.5, గుజియారో డేవిడ్ 22 పాయింట్లతో తర్వాతి స్థానాలను సాధించారు.

Latest Updates