ప్రాణం పోస్తున్నకండక్టరమ్మ సంకల్పం

అన్నెం పున్నెం ఎరగని చిన్నారులను ఓ జబ్బు పీడిస్తోంది. 20 రోజులకోసారి రక్తం ఎక్కించకపోతేఅది వాళ్ల ఊపిరే తీసేస్తుంది. అలాంటి జబ్బు పడిన పిల్లలకు ఒక అమ్మ అండగా నిలిచింది. రక్తం ,మందులు ఇస్తూ వాళ్లను ఆదుకుంటోంది.‘సంకల్ప’ పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించిన ఆమె కండక్టర్‌ గా పనిచేస్తోంది. ఈ రోజు ‘తలసేమియా డే’ సందర్భంగా ఆమె ప్రయాణం.

ఖమ్మం, వెలుగు  : తలసేమియా బారిన పడ్డ పిల్లలకు అండగా నిలుస్తోంది సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ. తలసేమియా బాధితులకు తొమ్మిదేళ్లనుంచి ఉచితంగా రక్తంతో పాటు మందులను అందిస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ బాధ్యతలను కొంతమంది డాక్టర్లు చూసుకుంటున్నారు.అయితే.. ఈ సంస్థ వెనుక ఉండి నడిపించేది మాత్రం ఒక మహిళా కండక్టర్ . పేరు పొద్దుటూరి అనిత. ఖమ్మం లోని ఇందిరానగర్‌‌‌‌ కాలనీలో ఉంటోందామె.ఖమ్మం ఆర్టీసీ బస్సుడిపోలో కండక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తోంది. ఆమె భర్త రవిచంద్ర హోంగార్డుగా పనిచేస్తున్నాడు. రవిచంద్ర తల్లి చంద్రలీల పెన్షన్ డబ్బులో మూడొంతులు ఈ సంస్థకు ఇస్తానంది. 2010 ఆగస్టు 30న ‘సంకల్ప’సంస్థ ఏర్పా టు చేశారు. భర్త, అత్తలతో పాటుమిగతా కుటుంబ సభ్యులు కూడా సంపాదనలోకొంత భాగాన్ని సంస్థకు ఇస్తున్నారు. మొదట్లో 30 మంది చిన్నారులకు సంకల్ప సేవలు అందించింది. ఇప్పుడా సంఖ్య 250కి చేరిం ది.అనిత ‘సంకల్ప’బలంతో ఇప్పుడు వందలాది తలసేమియా చిన్నారులు ఊపిరి నిలుపుకొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ సంకల్ప యాత్ర ప్రారంభానికి కారణాలను ఇలా చెప్పుకొచ్చింది అనిత.

బంధువుల ఆవేదన చూసి..

‘‘పదేళ్ల క్రితం మా సమీప బంధువు కొడుకు తలసేమియాతో బాధపడుతూ చనిపోయాడు.అప్పుడు ఆ తల్లిదండ్రుల బాధను చూసి ఇలాంటి బాధ ఇంకెవరికీ రాకూడదు అనుకున్నా. అప్పుడే సంకల్ప ఫౌండేషన్ ను స్థాపించా. అప్పటినుంచి ఎన్నో కష్ట నష్టాలకోర్చి సంస్థను నడుపుతున్నా.స్వచ్ఛందంగా సేవ చేస్తున్నా.. సహకరించే వాళ్లు లేకపోవడంతో కొన్నాళ్లు చాలా ఇబ్బం దులు పడ్డాను . రక్త సేకరణ కోసం చాలా సంస్థలను అభ్యర్థించాను. అయినా పిల్లలకు కావాల్సినంత రక్తం సేకరించలేకపోయా.అప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహించడం మొదలుపెట్టాను .ధనవంతుల ఇళ్లకు వెళ్లి పుట్టిన రోజు,పెళ్లి రోజుల సందర్భంగా రక్తదానశిబిరాలు ఏర్పాటు చేయాలని అడిగాను. తలసేమియా చిన్నారుల బాధలను, వాళ్లకుటుం బాలు అనుభవిస్తున్న మానసికక్షోభను వివరిం చాను. దాంతో వాళ్లు కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు . అలా సేకరించిన రక్తం తలసేమియా బాధితులకు అందిస్తున్నా.

రక్త సేకరణ ఇలా..

మొదట్లో నెలకు రెండు, మూడు బ్యాగులరక్తం సేకరిం చేవాళ్లం . ఇప్పుడు 500బ్యాగులకు చేరింది. ఇంత స్థాయిలో రక్తం సేకరిస్తేనే నెలకు 250 మంది చిన్నారులకు సరిపోతుంది. అందుకే ప్రతి నెలా రక్తం కోసం కాలేజీలు, స్కూళ్లలో క్యాంపులు నిర్వహిస్తున్నాం . కండక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూనే,సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నా.చుట్టుపక్కల జిల్లాలకే కాదు హైదరాబాద్‌ లోఉండే తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా ఖమ్మం నుంచి దాతల రక్తం పంపుతున్నాం .

దాతల సహకారంతో..

మా సేవలను గుర్తించిన కొంతమంది మాతో కలిసి పనిచేసేందుకుముందుకొచ్చారు . ప్రస్తుతం సంస్థ బాధ్యతలను కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు కూడా పంచుకున్నారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేష్ మెడిసిన్కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. పిల్లలవైద్య నిపుణుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్తన ఆస్పత్రిలో చిన్నారులకు ఉచితంగాబ్లడ్ ఎక్కిస్తున్నారు. ‘శివ’ బ్లడ్ బ్యాంక్నిర్వాహకులు రక్తాన్ని ఉచితంగా శుద్ధిచేసి అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు,దాతల సహకారంతో ఇప్పుడు ప్రతినెలా 3లక్షల రూపాయల విలువైనమెడిసిన్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందిస్తున్నాం ’ అంటూ తనప్రయాణం గురిం చి చెప్పుకొచ్చింది అనిత. ఆమె తలసేమియా బాధితులకుసేవ చేస్తున్నందుకు, సదస్సుల ద్వారా ప్రజలకు తలసేమియాపై అవగాహనకల్పిస్తున్నందుకు గతేడాది జూలైలోఉత్తమ మోటివేటర్‌‌‌‌ అవార్డు దక్కిం ది.సంస్థ ద్వారా మరింత మంది బాధితులకు వైద్యం అందేలా చేయడమేమా లక్ష్యం.

 

Latest Updates