ఆ రన్‌వే సేఫ్‌ కాదని 9ఏండ్ల క్రితమే హెచ్చరించిన ఎక్స్‌పర్ట్స్‌

  •  మంగళూరు ఘటన జరిగినప్పుడే వార్నింగ్‌

చెన్నై/ తిరువనంతపురం: కరిపూర్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌లోని రన్‌వే 10 సేఫ్‌ కాదని, దానిపై ల్యాండింగ్‌ నిలిపేయాలని ఎక్స్‌పర్ట్స్‌ 9ఏండ్ల క్రితమే హచ్చరించారు. రన్‌వేపై ల్యాండింగ్‌కి అనుమతిచ్చొద్దని, ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో ఇంకా డేంజర్‌‌ అని హెచ్చరించినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కాన్‌స్టిట్యూట్‌ చేసిన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ మెంబర్‌‌ కెప్టెన్‌ మోహన్‌ రంగనాథ్‌ అన్నారు. “ మంగళూరు విమాన ప్రమాదం జరిగినప్పుడే వార్నింగ్‌ ఇచ్చాము. కానీ పట్టించుకోలేదు. ఆ రన్‌వే డౌన్‌స్లోప్ ఉన్న టేబుల్‌ టాప్‌ రన్‌వే. రన్‌వే చివర ఉన్న బఫర్‌‌ జోన్‌ సరిపోదు. టోపోగ్రఫీ ప్రకారం ఎయిర్‌‌పోర్ట్స్‌లో రన్‌వే చివర 240 మీటర్ల బఫర్‌‌ జోన్‌ ఉండాలి, కానీ రన్‌వే 10కి 90 మీటర్లు మాత్రమే ఉంది. రన్‌వై సైడ్‌లో 100 మీటర్ల స్పెస్‌ కచ్చితంగా ఉండాల్సి ఉండగా.. కేవలం 75 మీటర్లు మాత్రమే ఉంది” అని ఆయన చెప్పారు. రన్‌వే 10ని ఉపయోగించొద్దని జూన్‌ 17, 2011లో లెటర్‌‌ రాసినట్లు ఆయన అన్నారు. మార్పులు చేయాలని సూచించినట్లు కూడా చెప్పారు. కోజికోడ్‌లో ఎయిర్‌‌ ఇండియా ఫ్లైట్‌ ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్‌వే పై నుంచి జారి లోయలో పడి రెండు ముక్కలు అయింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 20 మంది చనిపోయారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

2010 మే 22న మంగళూరులో ఇలాంటి ప్రమాదమే జరిగింది. దుబాయ్‌ నుంచి మంగళూరు విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం ఉదయం 6 గంటల సమయంలో దిగేందుకు ప్రయత్నించింది. ఆ రన్‌వే కూడా టేబుట్‌ టాప్‌ రన్‌వే కావడంతో ప్రమాదం జరిగింది. విమానం రన్‌వేను దాటి కొండ వారుగా పడిపోవడంతో మంటల్లో చిక్కుకుంది. ఆ ప్రమాదంలో సిబ్బందితో పాటు మొత్తం 158 మంది చనిపోయారు. మన దేశంలో కర్నాటకలోని మంగళూరు ఎయిర్‌‌పోర్ట్‌, కేరళలోని కోజికోడ్‌ ఎయిర్‌‌పోర్ట్‌, మిజోరంలోని లెంగ్‌వ్యూలలో ఈ టేబుల్ టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. పేరుకు తగ్గట్లుగా ఇది టేబుల్‌ ఉపరితంలానే ఉంటుంది. కొండలు, ఎత్తేన ప్రదేశాల్లో చదునుగా ఉండేచోట ఈ రన్‌వేలను ఏర్పాటుచేస్తారు. సాధారణ రన్‌వేలతో పోలిస్తే వీటి వెడల్పు తక్కువగా ఉంటుంది. పైలెట్లు ఎంతో జాగ్రత్తగా వీటిని ల్యాండ్‌ చేయాల్సి ఉంటుంది. చిన్న తప్పిదం జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని నిపుణులు చెప్పారు.

Latest Updates