ఆర్ఎంపీ ఐసొలేషన్ సెంటర్

కౌన్సిలర్ ఇంట్లో కరోనాకు ట్రీట్​మెంట్​

కంప్లయింట్​ చేసిన స్థానికులు  

జగిత్యాల,వెలుగు: అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్​ భర్త, ఆర్​ఎంపీగా ప్రాక్టీస్​ చేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా ఇంటిపైనే ఐసొలేషన్​ సెంటర్​ ఏర్పాటు చేశాడు. చుట్టూ కవర్లు కట్టి కరోనా ట్రీట్​మెంట్​ ఇస్తుండగా స్థానికులు  పోలీసులకు, వైద్యాధికారులకు కంప్లయింట్​ చేశారు. జగిత్యాలలోని  38 వ వార్డు కౌన్సిలర్ లావణ్య భర్త ప్రవీణ్ ఆర్ఎంపీగా ట్రీట్​మెంట్​ ఇస్తుండేవాడు. కొద్ది రోజులుగా 39 వ వార్డులో ఉన్న తన ఇంటిపై చుట్టూ కవర్లు కట్టి కరోనా పాజిటివ్ వచ్చిన పేషంట్లకు  చికిత్స చేస్తున్నాడని స్థానికులు గుర్తించి నిరసన తెలిపారు. దీంతో అతడు  పేషంట్స్ ను పంపించేశాడు. దీంతో వారు టౌన్ పోలీస్ స్టేషన్​తో పాటు  జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వెళ్లోలోపే  బంగ్లా పైన మొత్తం క్లీన్​ చేసేశారు. స్థానికులు మాట్లాడుతూ పబ్లిక్​ ప్లేసుల్లో ఓ ఆర్​ఎంపీ కరోనా పేషంట్లకు ట్రీట్​మెంట్​ ఇవ్వడం ఏమిటన్నారు. ఇది తమతో పాటే ఆ పేషంట్లకు కూడా ప్రమాదమేనన్నారు.

 

Latest Updates