పాక్ కు ఝలక్..ఇండియాకే రష్యా మద్దతు

russia-hopes-indiapak-want-to-allow-aggravation-scrapping-article-370

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై ఓవర్ యాక్షన్ చేస్తున్న పాక్ కు రష్యా ఝలక్ ఇచ్చింది.  ఆర్టికల్ 370 రద్దు  అంతర్గత వ్యవహారమని.. భారత్ రాజ్యాంగం పరిధి మేరకే చేసిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఇండియా -పాక్ సంయమనం పాటించాలని సూచించింది.1972 లో జరిగిన శిమ్లా ఒప్పందం  ప్రకారం  దౌత్య,రాజకీయ చర్చల ద్వారానే  ఇరు దేశాల మద్య విభేదాలు పరిష్కారమవుతాయని ప్రస్తావించింది.

 

 

Latest Updates