వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తాం.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆఫర్

మాస్కో: కరోనా కరాళ నృత్యం చేస్తూ ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌‌‌ను అందుబాటులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇండియాతో సహా పలు దేశాల్లో వ్యాక్సిన్ పలు ట్రయల్స్ దశలో ఉన్నాయి. అందరికంటే ముందుగా రష్యా స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌‌ను కనుగొన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తమ వ్యాక్సిన్‌‌‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదండోయ్. కేవలం యునైటెడ్ నేషన్స్ స్టాఫ్‌‌‌కు మాత్రమే మరి. వరల్డ్‌‌వైడ్‌‌గా ఉన్న యూఎన్ స్టాఫ్‌‌కు వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని పుతిన్ తెలిపారు.

‘మనలో ఎవరైనా ఈ ప్రమాదకర వైరస్ బారిన పడొచ్చు. యునైటెడ్ నేషన్స్ స్టాఫ్‌‌ను కూడా ఇది వదల్లేదు. యూఎన్ వర్కర్స్‌‌కు వ్యాక్సిన్ ఆఫర్ చేస్తున్నాం. ఆ సంస్థ ఉద్యోగులతోపాటు వ్యాక్సినేషన్ కోసం వాలంటీర్లుగా పని చేసే వారికి మా వ్యాక్సిన్‌‌ను ఫ్రీగా సప్లయి చేస్తాం. దీని గురించి కొంత మంది యూఎన్ కొలీగ్స్ నన్ను అడిగారు. వాళ్ల విషయంలో మేం భిన్నంగా వ్యవహరించబోం’ అని పుతిన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఆఫర్ చేసినందుకు పుతిన్‌‌కు యూఎన్ అధికార ప్రతినిధి స్టెఫేన్ డుజార్రిక్ ధన్యవాదాలు చెప్పారు. వ్యాక్సిన్‌‌‌ను తమ వైద్య బృందం పరిశీలిస్తుందన్నారు.

Latest Updates