ఆగ‌స్ట్ 10 న క‌రోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తాం

ప్ర‌పంచ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అయితే ఆయా దేశాలు త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉండ‌గా.. ర‌ష్యా త‌యారు చేస్తున్న తొలి క‌రోనా వ్యాక్సిన్ ఆగ‌స్ట్ 10న అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌ముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ నివేదించింది.

ఈ సంద‌ర్భంగా రష్యన్ డైర‌క్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్ మాట్లాడుతూ ర‌ష్యా మాస్కోకు చెందిన గమలేయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌రిశోధ‌న‌ల‌కు తాము ఆర్ధిక సాయం అందిస్తున్న‌ట్లు చెప్పారు.

‌1957 సోవియట్ యూనియన్ మొట్ట‌మొద‌టి శాటిలైట్ ను ప్ర‌యోగించింది. శాటిలైట్ ప్ర‌యోగంపై అమెరిక‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇది కూడా అంతే. క‌రోనా వ్యాక్సిన్ ను ర‌ష్యా అందుబాటులోకి తెస్తుంది. ఆగ‌స్ట్ 10లోగా వ్యాక్సిన్ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని కిరిల్ తెలిపారు.వ్యాక్సిన్ విడుద‌ల అనంత‌రం తొల‌త ఫ్రంట్ లైన్ సిబ్బందికి అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు

నివేదిక‌ల ప్ర‌కారం రష్యన్ వ్యాక్సిన్ ఇంకా రెండవ దశ పూర్తి చేయలేద‌ని తెలుస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుపుతున్న ప్ర‌యోగాల్లో కొన్ని వ్యాక్సిన్లు ఇప్ప‌టికే మూడో ద‌శ‌లో ఉండ‌గా..ర‌ష్యాలో జ‌రిగే హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో ర‌ష్యా సైనికులు పాల్గొన్నార‌ని ఆదేశ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Latest Updates