ఒక్కరోజులో భారీగా నమోదైన కరోనా కేసులు

మాస్కో: రష్యాలో కరోనా విశ్వరూపం దాల్చింది. ఆదివారం ఒక్కరోజులోనే 10,600 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. రష్యాలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదవడం రికార్డు అని ప్రకటించింది. ఇందులో సగానికి పైగా కేసులు కేపిటల్ సిటీ మాస్కోలోనే ఫైల్ అయినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో 58 మంది మృత్యువాత పడగా .. దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి చనిపోయినవారి  సంఖ్య 1,420 కి చేరుకుంది. ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం కేసులు 134,000 కు చేరుకోగా.. కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,639 గా ఉంది. ఇటలీ, స్పెయిన్ దేశాలతో పోలిస్తే రష్యాలో మరణాలు రేటు తక్కువగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ మే 12 నుంచి జోన్​ల వారీగా లాక్​డౌన్ సడలింపులు ఇవ్వనున్నట్లు సూచించింది.

Latest Updates