చైనీయులను దేశంలోకి అనుమతించని రష్యా

కరోనా వైరస్ కారణంగా కారణంగా చైనా దేశస్తులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. లేటెస్టుగా రష్యా కూడా చైనీయులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రధాని మిఖాయిల్‌ మిశుస్టిన్‌ నిర్ణయంపై సంతకం చేశారు. తమ దేశంలోకి వచ్చే చైనా పర్యాటకులు, విద్యార్థులు, పని వీసాలతో వచ్చే వారికి ఈ నిషేధం వర్తిస్తుంది. అయితే …ఈ నిషేధం రష్యా ఎయిర్ పోర్టుల మీదుగా ప్రయాణం చేసే వారికి వర్తించదని తెలిపింది.

కరోనా వైరస్ తమ దేశంలో వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే చైనా, ఉత్తర కొరియాలకు విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేయండంతో పాటు  చైనా ప్రజలకు వర్క్‌ వీసా జారీ చేయడాన్ని నిలిపివేసింది. రష్యాలో చదువుకునే చైనా విద్యార్థులను మార్చి వరకూ రాకూడదని ఇప్పటికే సూచించింది.

మాస్కో సమయం ప్రకారం గురువారం రాత్రి 9గంటల నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని చెప్పారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని తెలిపారు.

Latest Updates