భార‌త్ లో ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ : రెడ్డీస్ ల్యాబ్ తో భారీ ఒప్పొందం

రష్యా క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ – వి హ్యూమ‌న్ ట్ర‌య‌ల్ భార‌త్ లో నిర్వ‌హించేలా ఒప్పొందాలు జ‌రిగాయి.

స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ ను భార‌త్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించి, స‌ర‌ఫ‌రా చేసేందుకు మ‌న దేశానికి చెందిన ఫార్మా దిగ్గ‌జం రెడ్డీస్ ల్యాబ్ తో ఒప్పొందం కుదుర్చుకున్న‌ట్లు ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ( ఆర్డీఐఎఫ్) అధికారికంగా ప్ర‌క‌టించింది.

ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ( ఆర్డీఐఎఫ్) ప్ర‌కారం.. 100మిలియ‌న్ల స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ ల‌ను భార‌త్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ సంస్థ‌కు అమ్మేందుకు ఒప్పందాలు జ‌రిగిన‌ట్లు తెలిపింది.

కాగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఇప్పటికే క‌జికిస్తాన్, బ్రెజిల్ మరియు మెక్సికోలకు స్పుత్నిక్ -వీ ని అందించేందుకు ఒప్పొందాలు కుదుర్చుకుంది.

భార‌త్ కు 300 మిలియ‌న్ల వ్యాక్సిన్ల‌ను అందించేందుకు ఒప్పొందాలు కుదుర్చుకున్న‌ట్లు ర‌ష్యా అధికారులు వెల్ల‌డించారు.

Latest Updates