ఇంట్లో బోర్​ కొట్టి.. డెలివరీ బాయ్​ అయ్యిండు

  • లాక్​డౌన్​ నుంచి బయటపడేందుకు రష్యా బిజినెస్​ మ్యాన్​ ప్రయత్నాలు
  • సొంత బిజినెస్​తో ఏడాదికి 2 మిలియన్ డాలర్ల సంపాదన
  • ఇప్పుడు డెలివరీలు చేస్తే వచ్చేది రోజుకు 13 నుంచి 20 డాలర్లే

మాస్కో: కరోనా వైరస్​ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్​ మరింత విస్తరించకుండా మెజారిటీ దేశాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇండ్లకే పరిమితమైపోయారు. ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టడానికి లేకపోవడంతో ఇంటర్నెట్ సెర్చింగ్, ఆన్​లైన్​ మూవీస్​ చూడటానికే ఎక్కువ మంది పరిమితమైపోయారు. రష్యాకు చెందిన ఓ బిజినెస్​ మ్యాన్​ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. మాస్కోలో లాక్​డౌన్​ విధించడంతో ఇంట్లో ఉండి ఉండి బోర్​ కొట్టేసింది. ఎలాగైనా బయటకు రావాలని డిసైడ్​ అయిన అతను చివరికి డెలివరీ బాయ్​గా మారి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. వచ్చే జీతం తక్కువే అయినా ఫిజికల్లీ యాక్టివ్​ జాబ్​ కావడంతో మీల్స్​ డెలివరీ చేస్తూ గడిపేస్తున్నాడు.

రోజుకు వచ్చేది 10 నుంచి 20 డాలర్లే
లాక్​డౌన్​ కారణంగా మాస్కోలో జనం బయటకు రావడంపై నిషేధం విధించారు. కీలకమైన ఇండస్ట్రీల్లో పని చేసే వారిని కూడా వర్క్​ ఫ్రం హోం చేయమని చెబుతున్నారు. నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్​ కోసమే దగ్గరలోని షాపులు, ఫార్మసీలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం ఫుడ్ డెలివరీలకు డిమాండ్​ పెరిగింది. లాక్​డౌన్ కారణంగా తన బిజినెస్​ మొత్తం కోల్పోయిన 38 ఏండ్ల సెర్జే నొచోవ్నీ.. తన లైఫ్​ను ఇంకో యాంగిల్​లో చూడాలనుకున్నాడు. లాడ్​డౌన్​లో మాస్కో ఎలా ఉంది. జనం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఫుడ్​ డెలివరీపై ఎటువంటి బ్యాన్​ లేనందున ఒక మేజర్​ ఫుడ్​ డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్​గా చేరాడు. బైక్​పైనో.. సైకిల్​పైనో ఫుడ్​ డెలివరీ చేయడం కాదు. కాలి నడకనే ఫుడ్​ డెలివరీ చేయాలి. దీంతో రోజూ యావరేజ్​గా 20 కిలోమీటర్లు నడుస్తున్నానని నొచోవ్నీ చెప్పాడు. 12 ఏండ్లు చైనాలో ఉన్న అతడు గతేడాది రష్యాకు తిరిగి వచ్చేశాడు. సొంతంగా కన్సల్టింగ్​ బిజినెస్​ స్టార్ట్ చేశాడు. దాని ద్వారా ఏడాదికి 2 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఫుడ్​ డెలివరీల ద్వారా అతడికి వచ్చేది రోజుకు 13 నుంచి 20 డాలర్లే. గతంతో పోలిస్తే ఫిజికల్​ యాక్టివిటీ బాగా పెరిగిందని, లాక్ డౌన్​ వల్ల తాను ఇన్నాళ్లూ దానిని మిస్​ అయ్యానని నొచోవ్నీ చెప్పాడు. ఎల్లో కలర్​ యూనిఫాం వేసుకోవడం వల్ల డెలివరీ బాయ్​ ఎవరనేది ఎక్కువ మంది జనం పట్టించుకోవడం లేదన్నాడు.

Latest Updates