సుక్కేసిండు..గుద్దేసిండు!

Russian cargo ship collision SEAGRAND Korea bridge crash

Russian cargo ship collision SEAGRAND Korea bridge crashతాగి వాహనం నడపడం ప్రమాదకరం. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ మనకు చెప్పే మాటిది. డ్రంకెన్ బాబులను కంట్రోల్ చేసేందుకు డ్రంకెన్ డ్రైవ్ ప్రోగ్రామ్​లూ చేస్తుంటారు. వాళ్లు చెప్పడమో, చేయడమో కాదు.. నిజానికి తాగి నడపడం ఎంత ప్రమాదకరమో మనకూ తెలుసు. ఓ రష్యా డ్రైవర్ కూడా అలాగే నిబంధనలు ఉల్లంఘించేశాడు. తాగి నడిపి బ్రిడ్జికి ఢీకొట్టేశాడు. అది ఏ లారీనో, బస్సో కాదు.. ఓ పెద్ద షిప్పు. దక్షిణ కొరియాలో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. బూసాన్ లోని గ్వాంగన్ బ్రిడ్జిని 6 వేల టన్నుల బరువైన సీగ్రాండ్ అనే షిప్పు ఢీకొట్టింది. నిజానికి ఆ బ్రిడ్జి కింది నుంచి అంత పెద్ద ఓడలు వెళ్లలేవు. కానీ, అప్పటికే ఫుల్లుగా తాగేసి ఉన్న ఆ ఓడ కెప్టెన్ సరాసరి ఆ బ్రిడ్జి తొర్రలోకి పోనిచ్చాడు. మళ్లీ రివర్స్ చేసి అక్కడి నుంచి వెళ్లేలోపు కొరియా కోస్ట్​గార్డ్​లొచ్చి అతడితో సహా షిప్పును అధీనంలోకి తీసుకున్నారు.

Russian cargo ship collision SEAGRAND Korea bridge crashఅతడి ఆల్కహాల్ స్థాయిలను టెస్ట్​ చేయగా ఉండాల్సిన (0.03%) దాని కన్నా మూడు రెట్లు ఎక్కువుందని తేలింది. అంతేకాదు.. బ్రిడ్జిని ఢీకొట్టడానికి ముందు మరో చిన్న క్రూయిజ్​ షిప్పును ఆ ఓడ ఢీకొట్టినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఐరన్ పైపులను దించేందుకు ఆ ఓడ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఓడ ఢీకొట్టడంతో బ్రిడ్జి కొద్దిమేర ధ్వంసం అయింది. దక్షిణకొరియాలోనే రెండో పొడవైన బ్రిడ్జి అది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు.

Russian cargo ship collision SEAGRAND Korea bridge crash

Latest Updates