రష్యా: నీటిపై తేలే న్యూక్లియర్ రియాక్టర్

మాస్కో: సముద్రంపైన షికారుకెళుతున్న భారీ పడవలా కనిపిస్తోంది కానీ నిజానికిదో న్యూక్లియర్ ​రియాక్టర్.. ప్రపంచంలోనే నీటి మీద తేలే తొలి రియాక్టర్​ ఇదే. ఆర్కిటిక్​లోని పెవెక్​టౌన్​లో పాడైపోయిన న్యూక్లియర్​ప్లాంట్​కు అల్టర్నేటివ్​గా ఉపయోగించుకోవడానికి రష్యా దీనిని తయారుచేసింది. 2006లో తయారీ మొదలెడితే ఇప్పటికి సిద్ధమైంది. శుక్రవారం పెవెక్​వైపు ప్రయాణం మొదలెట్టింది కూడా.. ఆర్కిటిక్​ ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. అలాంటి చోట న్యూక్లియర్ ​ప్లాంట్​కట్టడం కన్నా ఇదే మేలని రష్యా చెబుతోంది. అయితే, పర్యావరణవేత్తలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటిమీద తేలే ఈ ప్లాంటు మరో చెర్నోబిల్​లాంటిదని అంటున్నారు. అణు ఇంధనంతో ప్రయాణంచేసే ఈ పడవ పొరపాటున ప్రమాదానికి గురైతే భారీ నష్టం తప్పదని వార్నింగ్ ​ఇస్తున్నారు. ఈ ప్రయాణాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్​చేస్తున్నారు. మంచు ఖండం మీద చెర్నోబిల్​ను ఉంచినట్లేనని ఆందోళన చెందుతున్నారు. ప్రయాణం మధ్యలో ఈ నౌక ఇతర పడవనో, మంచు పర్వతాన్నో ఢీ కొంటే నాటి చెర్నోబిల్​ఘటన రిపీట్​అవుతుందని రష్యాను హెచ్చరిస్తున్నారు. మిలటరీ టెస్టింగ్​సెంటర్ లో ఈమధ్య జరిగిన ప్రమాదాన్ని, అది సృష్టించిన రేడియోయాక్టివ్​సర్జ్​ను వారు గుర్తుచేస్తున్నారు. రష్యా మాత్రం ఈ ఆందోళనలను లెక్కచేయడంలేదు.

Latest Updates