గర్ల్ ఫ్రెండ్ చుట్టూ 16 యుద్ధ ట్యాంకులు పెట్టి ప్రపోజ్ చేసిండు

16 యుద్ధ ట్యాంకులు బారులు తీరినయ్ . హార్ట్ షేప్ లో ఫార్మ్ అయినయ్ .ఇంతలో ఓ సైనికుడు తాను ప్రేమించిన అమ్మాయి కళ్లు మూసి ఆ యుద్ధట్యాంకుల మధ్యలోకి తీసుకొచ్చాడు. మోకాళ్లపై కూర్చుని ఆర్మీ స్టయిల్లో ఐలవ్ యూ అన్నాడు. ‘‘నీతో జీవితాంతం బతకాలని ఉంది. నన్ను పెళ్లిచేసుకుంటా వా?’’ అని అడిగాడు. అతడి ప్రపోజల్ కు ఫిదా అయిపోయిన ఆ అమ్మాయి వెంటనే, ఐ లవ్ యూ టూ అనేసింది. రష్యా రాజధానిమాస్కోలోని అల్యాబినో ట్రైనింగ్ గ్రౌండ్ లో జరిగిందీ ఆర్మీ స్టైల్ లవ్ ప్రపోజల్ . ఆర్మీలో పనిచేసే ప్లటూన్ కమాండర్ డెనిస్ కజంత్సవ్ వాలెంటైన్స్​ డే నాడు ఇలా ప్రపోజ్ చేసి తాను ప్రేమించిన అమ్మాయి అలెగ్జాండ్రా కొపిటోవాను ఆశ్చర్యంలో ముంచెత్తా డు. తర్వాత రింగ్ తొడిగితన ప్రేమకు స్ట్ రాంగ్ ముడి వేశాడు.

Latest Updates