పూట భోజనం ఖర్చు రూ. 2.39 లక్షలు

ఒక్కపూట భోజనం చేయడానికి ఎంత ఖర్చు చేయోచ్చు. రూ.100, రూ. 200. కానీ ఓ వ్యక్తి ఒక్కపూట భోజనం కోసం రూ.2.39లక్షలు వెచ్చించాడు.  రష్యాకు చెందిన ఓ మిలీనియర్ విక్టర్ మార్టినోవ్ అనే 33 ఏళ్ల వాణిజ్యవేత్త.. క్రిమియాలోని అలుష్తాలో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. అదే సమయంలో తన ప్రియురాలికి  మెక్‌డోనల్డ్స్ మీల్ తినాలనే కోరిక కలిగింది. కానీ అక్కడ మెక్ డోనాల్డ్స్ అవుట్ లెట్ లేవు. ప్రియురాలికోరిక తీర్చకపోతే పరువుపోతుందని భావించిన మార్టినోవ్ .. ఎక్కడో 720 మైళ్ల దూరంలో ఉన్న క్రస్నోడర్‌కు వెళ్లి తనకు కావాల్సిన బిగ్ మ్యాక్స్, ఫ్రైస్, మిల్క్ షేక్‌లు ఆర్డర్ చేశాడు. వాటిని పట్టుకుని మళ్లీ హాలీడే విడిదికి తిరిగి వెళ్లిపోయాడు.

 

Latest Updates