ఓవీఎల్‌ చేతికి రష్యా ఆయిల్‌ ఫీల్డ్స్‌

రష్యాలోని వాంకర్‌ క్లస్టర్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌ లో 49 శాతం వాటా కొనడానికి ఓఎన్‌ జీసీ విదేశ్‌ (ఓవీఎల్‌ ) నాయకత్వంలోని ఇండియా కంపెనీలు సూత్రప్రాయ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రష్యా పర్యటనలో దీనికి సంబంధించిన తుది ఒప్పందం మీద సంతకాలు జరగనున్నాయి. ఆయిల్‌ , గ్యాస్‌ సహా వివిధ రంగాలలో ఇరు దేశాలు సహకరించుకునేందుకు మరిన్ని ఒప్పందాలు కూడా ప్రధాని పర్యటనలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్‌ ఫీల్డ్స్‌ లో వాటా కోసం ఇండియా కంపెనీలు 2017 నుంచి చర్చలు సాగిస్తున్నాయి.

వాంకర్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌ లో కన్సార్టి యమ్‌ భాగస్వాములలో ఓఎన్‌ జీసీ 26 శాతం, ఐఓసీ, బీపీఆర్‌ ఎల్‌ లు మిగిలిన 23 శాతం వాటా తీసుకుం టాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థయిన రాస్నెఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఈ ఆయిల్‌ ఫీల్డ్స్‌ లో మెజారిటీ వాటా అట్టేపెట్టుకోవాలని కోరుకుంటోంది. తన ఇంధన అవసరాలు నెరవేర్చు కోవడానికి రష్యా నుంచి రోజుకి పది లక్షల బారెల్స్‌ ఆయిల్‌ , గ్ యాస్‌ తీసు కోవాలని ఇండియా భావిస్తోంది. రష్యాలోనే మరో ఆయిల్‌ పీల్డ్‌‌‌‌‌‌‌‌ సఖాలిన్‌ –3లో ఇప్పటికే ఓవీఎల్‌ కు 20 శాతం వాటా ఉంది. 2009 లో ఈ వాటా కోసం 2.1 బిలియన్‌ డాలర్లను ఓవీఎల్‌ వెచ్చించింది.

Latest Updates