రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పోక్స్ పర్సన్ కు కరోనా

మాస్కో : రష్యా లో కరోనా విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కీలకమైన అధికారులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఫుతిన్ స్పోక్స్ పర్సన్ డిమిత్రి పెస్కోవ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దాదాపు రెండు వారాలుగా ఆయన పుతిన్ ను కలవలేదు. దీంతో అధ్యక్షుడి కరోనా సోకే ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్, కల్చరల్ మినిస్టర్ ఓల్గా లియుబిమోవా, మరో మినిస్టర్ వ్లాదిమిర్ ఎకుషెవ్ కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రెసిడెంట్ పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే సమవేశాలు నిర్వహిస్తున్నారు. రష్యా ప్రైమ్ మినిస్టర్ మిషుస్టిన్ సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విధులు నిర్వహిస్తున్నారు.

Latest Updates