వేడి నీళ్లతో క‌రోనా చచ్చిపోతుంది : గుర్తించిన సైంటిస్ట్ లు

ప్ర‌పంచ వ్యాప్తంగా 160కి పైగా దేశాలకు చెందిన సైంటిస్ట్ లు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ  ప‌రిశోధ‌న‌లతో సైంటిస్ట్ లు వ్యాక్సిన్ ను త్వ‌ర‌గా అందుబాటులో తెచ్చే అవ‌కాశం ఉంది.

ఇదే స‌మ‌యంలో ర‌ష్య‌న్ సైంటిస్ట్ లు క‌రోనా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెలుగులోకి తెచ్చారు. క‌రోనా త‌న శ‌క్తిని కోల్పోయే ప్ర‌దేశాన్ని గుర్తించారు.

రష్యాకు చెందిన సైబీరియాలోని నోవోసిబ‌ర్క‌స్ లోని వెక్టర్ స్టేట్ రిసెర్చ్ సెంట‌ర్ ఆఫ్ వైరాల‌జీ అండ్ బ‌యోటెక్నాల‌జీ సైంటిస్ట్ ల బృందం గది ఉష్ణోగ్రత‌ కలిగిన నీరు ఒక రోజు వ్యవధిలో కరోనా వైరస్‌కు చెందిన 90 శాతం కణాలను చంపగలదని, అదే మూడు రోజుల్లో 99.9 శాతం కణాలను నాశనం చేస్తున్న‌ట్లు గుర్తించారు.అలాగే, మరుగుతున్న నీరు కరోనా వైరస్‌ను పూర్తిగా చంపగలదని గుర్తించారు.

కరోనా వైరస్‌ క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీటిలో జీవించగలిగినప్పటికీ, తన సంతతిని పెంచుకోలేకపోతుందని వెల్లడించారు. క్లోరిన్ వాట‌ర్ వైర‌స్ ను చంపడంలో కీల‌క పాత్ర‌పోషిస్తున్న‌ట్లు తెలిపారు.

స్పుట్నిక్ మీడియా క‌థ‌న ప్ర‌కారం క్లోరినేటెడ్ వాట‌ర్ క‌రోనా వైర‌స్ ను చంపుతుంద‌ని సైంటిస్ట్ ల‌ బృందం కనుగొంది. అంతేకాదు వైర‌స్ కొంత‌కాలం జీవించిన‌ప్ప‌టికీ క్లోరినేటెడ్ వాట‌ర్ మరియు సముద్రపు నీటిలో ఉండలేద‌ని సైంటిస్ట్ ల బృందం తెలిపారు. వైర‌స్ జీవితకాలం నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంద‌ని ర‌ష్యా సైంటిస్ట్ ల బృందం గుర్తించింది.

Latest Updates