మూఢభక్తితో ఆరో ఫ్లోర్ నుంచి దూకిన రష్యన్ మహిళ

ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో విషాద ఘటన జరిగింది. శ్రీకృష్ణ భగవానుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో ఓ రష్యన్ మహిళ అపార్ట్ మెంట్ ఆరో ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. మృతురాలిని తాత్యానా హెమెలోవ్ స్కయా అని గుర్తించారు. గతేడాది ఆమె ఫిబ్రవరి నుంచి బృందావన్ ధామ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది.

రష్యాలోని రోస్తోవ్ చెందిన తాత్యానా హెమెలోవ్ స్కయా.. శ్రీకృష్ణుఢి భక్తురాలు. ఆమె రష్యన్ మహిళ టూరిస్టు వీసాపై భారత్ వచ్చినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ ఎంపీ సింగ్. బృందావన్ ధామ్ అపార్ట్ మెంట్ లోని  ఆరో ఫ్లోర్ లో ఒంటరిగా ఉంటోందని తెలిపారు.

తాత్యానా స్నేహితులు కూడా ఇదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. పోలీసులు వారిని విచారించగా, తాను శ్రీకృష్ణుడ్ని కలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పేదని తెలిసింది. తాత్యానా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు, ఆమె మృతి విషయాన్ని రష్యా దౌత్య కార్యాలయానికి తెలియజేశారు.

Latest Updates