స్కైబోట్‌ రోబో అంతరిక్ష కేంద్రానికి చేరింది

అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి స్కైబోట్‌ F-850 రోబో చేరుకుంది. మానవ రహిత వ్యోమనౌక ఇవాళ(మంగళవారం) ఉదయం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు అనుసంధానమైందని నాసా ప్రకటించింది. మంగోలియాకు 250 మైళ్ల ఎత్తులో ఈ డాకింగ్‌ జరిగినట్లు తెలిపింది. గత రాత్రి 11 గంటలకు డాకింగ్ జరిగినట్లు నాసా తన ట్విట్టర్‌లో చెప్పింది.  ఆ వ్యోమనౌకలో రష్యాకు చెందిన హ్యూమనాయిడ్ రోబో ఉంది. రష్యాకు చెందిన సోయేజ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో వెళ్లిన ఈ రోబో తో పాటు 1450 పౌండ్ల బరువైన కార్గో కూడా ఉంది. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఎక్స్‌పడీషన్‌ 60 కి చెందిన వ్యోమగాములు ఉన్నారు.

Latest Updates