హాకీ ఆడుతూ కిందపడ్డ రష్యా అధ్యక్షుడు

russias-president-putin-falls-on-ice-after-hockey-match

పాపం పుతిన్..

పాపం పుతిన్ .. ఎందుకంటారా?రష్యా అధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది మరి. ఏటా నిర్వహించి ఐస్హాకీ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ కూడా ఆ ఆటలో భాగమయ్యారు. టీమ్ జెర్సీ వేసుకున్నారు. ఐస్ పిచ్ పై స్కేటింగ్ షూతో జారుతూ అక్కడకొచ్చిన ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నారు. విష్ చేస్తూ చేస్తూ కింద ఎత్తుగా ఉన్న ఓ దిమ్మెను గుర్తించలేకపోయారు. దీంతో ఆయన దభేల్ మని కిందపడిపోయారు. ఆయన మొహం ఐస్ ను కొంచెం బలంగానే తాకింది. అయినా వెంటనే తేరుకున్న ఆయన, పైకి లేచారు. హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది,లేదంటే ఆయనకు దెబ్బ పెద్దగానే తగిలి ఉండేది. ఆ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పుతిన్ 8గోల్స్​ చేశారట మరి. రష్యాలోని సోచిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఊరుకుంటారా నవ్వు ఆపుకోలేకపోయారు. జోకులు పేల్చారు.