ఇండియాకు ఆర్కిటిక్ బొగ్గు

వన్యప్రాణులకు ముప్పు టమర్ పెనెన్సులా..  ఎప్పుడూ పచ్చటి పచ్చిక బయళ్లతో, ఒకవైపు సముద్రం, చల్లటి మంచుతో ఆహ్లాదంగా ఆండే ఆ ప్లేస్ వన్యప్రాణులకు స్వర్గం లాంటిది. ఐదు లక్షలకు పైగా రెయిన్ డీర్లకు ఇల్లు అది. వేలాది పోలార్‌‌ ఎలుగుబంట్లకు ఆవాసం. మంచు గుడ్లగూబలు, ఎరుపు ముక్కు బాతులు, ఉడతల్లాంటి లెమ్మింగ్స్, పొట్టి హంసలు, పెరెగ్రైన్, గిర్​ఫాల్కన్ గద్దల వంటి ఎన్నో జంతువులు, పక్షులకు అదే ప్రధాన ఆధారం. చాలా రకాల పక్షులు వేసవిలో ఇక్కడి వచ్చే గుడ్లు పెట్టి, సంతానాన్ని పెంచుతుంటాయి కూడా. కానీ..ఆ వైల్డ్ లైఫ్​హెవెన్ కు ఇప్పుడు కాలుష్యపు ముప్పు పొంచి ఉందట. అందుకు పరోక్షంగా మన దేశం కూడా కారణమవుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడి బొగ్గుకు మస్త్ డిమాండ్  

టేమర్ పెనెన్సులాని గనుల్లో హై క్వాలిటీ బొగ్గు ఉంది. దాని నుంచి ఆంథ్రసైట్ అనే కోకింగ్ కోల్ ను తీస్తారు. దీనినే కోక్ అంటారు. ఈ కోక్ ను స్టీల్, అల్యూమినియం తయారీ పరిశ్రమల్లో బ్లాస్ట్ ఫర్నేస్ ను మండించడానికి వాడతారు. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉండటంతో రష్యా ఇక్కడ మైనింగ్ పై ఫోకస్ పెట్టింది. నార్తర్న్ సీ రూట్ ద్వారా 2024 నాటికి ఏటా 8 కోట్ల టన్నుల కార్గో టార్గెట్ రీచ్ కావాలంటూ రష్యన్ కంపెనీలకు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇదివరకే ఆర్డర్ జారీ చేశారు. ఆర్కిటిక్ సముద్రంలో మంచును తొలగిస్తూ, ఓడలకు రూట్లను క్లియర్ చేసేందుకు రష్యా ఇప్పటికే న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ షిప్ లను రంగంలోకి దించింది.
ఇక 2030 నాటికి స్టీల్ ఉత్పత్తిని 30 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోకింగ్ కోల్ కోసం రష్యాతో మనదేశం ఒప్పందం చేసుకుంది.

Latest Updates