మిషన్ భగీరథ బిల్లులు మంజూరుకు 30 వేలు లంచం..

వికారాబాద్: తాండూరులో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు RWS ఉద్యోగులు అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. EE శ్రీనివాస్, వర్క్‌ఇన్సిపెక్టర్ మహేందర్‌ లు మిషన్ భగీరథ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశారు. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఈ మంగళవారం రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా.. ACB అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Latest Updates