బొమ్మ‌లో అమ్మ‌ : ఆచూకీ క‌నిపెట్టిన వారికి 4 ల‌క్ష‌ల బ‌హుమతి ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన హీరో

కెన‌డాకు చెందిన సోరియాన్ అనే మ‌హిళ ఇల్లు మారింది. ఈ ఇల్లు మారే హ‌డావిడిలో ఓ టెడ్డీబేర్ పోగొట్టుకుంది. ఆ టెడ్డీ బేర్ ప్లేస్ లో మ‌రో టెడ్డీబేర్ ఉంది. దీంతో ఆ డెడ్డీ బేర్ ఎవ‌రో దొంగ‌త‌నం చేశారు. నాకు నా టెడ్డీబేర్ కావాలంటూ ఫీల్ అవుతూ ట్వీట్ చేసింది.

దీంతో ఆ ట్వీట్ స్పందించిన నెటిజ‌న్లు సోరియాన్ ను ఓదార్చేందుకు మీరు కొత్త టెడ్డీబేర్ కొనుక్కోవ‌చ్చుగా అంటూ రిప్ల‌యి ఇచ్చారు. అయితే ఆ రిప్ల‌యిపై స్పందించిన సోరియాన్ గతేడాది మా అమ్మ చ‌నిపోయింది. ఆమె మ‌ర‌ణానికి ముందు ఐ ల‌వ్ యూ నిన్ను చూసి గ‌ర్విస్తున్నాను .నేనెప్పుడూ నీ వెంటే ఉన్నానంటూ ఆమె మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేశాను. ఆ బొమ్మ‌పై పంచ ‌ప్రాణాలు పెట్టుకొని బ్ర‌తుకుతున్నా. నాబొమ్మ నాకివ్వండి అంటూ సోష‌ల్ మీడియాలో వేడుకుంది.

ఆమె మాట‌ల‌కు డెడ్‌పూల్ స్టార్ హీరో ర్యాన్ రెనాల్డ్స్ స్పందించాడు. ఆ బొమ్మ‌ను ఆమె ద‌గ్గ‌రికి చేర్చిన‌వారికి 5 వేల డాల‌ర్లు (దాదాపు రూ. 4 లక్షలు) ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆమెకు తిరిగి బొమ్మ దొరికేంత‌వ‌ర‌కు మ‌నమంద‌రు సాయం చేయాలని కోరాడు.

Latest Updates