మే చివరి వారంలో రైతుబంధు

rythu-bandhu will be-distributed-on may last week
  • వానాకాలం పెట్టుబడికి అధికారుల ఏర్పాట్లు
  • 52 లక్షల మంది రైతులకు పంపిణీకి కసరత్తు
  • చెక్కులు లేనట్లే, ఇక నగదు బదిలీనే
  • బడ్జెట్‌ లో రూ.12 వేల కోట్ల కేటాయింపు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతుబంధు పంపిణీకి రంగం సిద్ధమవుతోంది.వానాకాలం పంట పెట్టుబడి సాయం అందించేం -దుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోం ది. మే చివరివారంలో పంపిణీ చేసేందు కు అధికారులు ఏర్పా-ట్లు చేస్తున్నా రు. జూన్‌‌ నుం చి ఖరీఫ్ పంట సాగుప్రారంభం కానున్న నేపథ్యం లో అంతకుముం దేపెట్టుబడి సాయం అందిం చాలని నిర్ణయిం చారు.

మొదటి విడతలో రూ.6 వేల కోట్లు

2019–20 ఓటాన్‌‌ అకౌంట్‌‌ బడ్జెట్లో ప్రభుత్వం రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈ మేరకు మొదటి విడత కోసం రూ.6వేల కోట్లు విడుదల చేయాల్సి ఉంది. గతంలో రైతుబంధు పొందిన వారు, కొత్తగా పాస్‌‌బుక్‌‌ పొందిన వారు, గతంలో సమస్య ఉండి పరిష్కరించుకున్న రైతులు… ఇలా అర్హులందరిని గుర్తిం చివివరాలు సేకరిం చాలని క్షేత్రస్థాయి అధికారులనువ్యవసాయ శాఖ ఆదేశించిం ది. గతంలో బ్యాం కుఖాతాలు ఇవ్వని రైతులు క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులకు అందిం చాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌‌ పంట పెట్టుబడి సాయం 52లక్షల మందికి పైగా రైతులకు అందిం చే అవకాశంఉందని తెలుస్తోంది.

గతేడాది రూ.10,505 కోట్లు

గతేడాది(2018–19) ఖరీఫ్‌‌లో 51.5 లక్షలమంది రైతులకు రూ.5,260 కోట్లు అందిం చారు.రబీలో 49 లక్షల మంది రైతులకు రూ.5,244కోట్లు పంపిణీ చేశారు. బడ్జెట్‌‌లో 12 వేల కోట్లుకేటాయిం చినా, రూ.10,505.20కోట్లు మాత్రమేపెట్టుబడి సాయం అందిం చడం గమనార్హం .

గతేడాది సమస్యలు

గతేడాది వానాకాలం నుం చి రైతుబంధు చెక్కులపంపిణీ చేపట్టారు. కొంత మంది భూస్వా ములు, వి-దేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూరికార్డుల్లో తలెత్తి న గందరగోళంతో పలువురుచెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీ-సుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయా-యి. యాసంగి సమయంలో ఎన్ని కల కోడ్‌‌ వల్లచెక్కుల పంపిణీపై ఎలక్షన్‌‌ కమిషన్‌‌ అభ్యం తరంవ్యక్తం చేసింది. రైతుల బ్యాం కు ఖాతాల్లోకి నేరుగావేయాలని ఆదేశించిం ది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి, రైతులఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతరదేశాల్లో, పట్టణాల్లో ఉన్న వారు బ్యాం కు ఖాతాలవివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడిసాయం అందలేదు. ఇటీవల యాసంగికి సంబంధించిన చెల్లింపులన్నీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారలు వెల్లడించారు.

Latest Updates