2023లో ఎస్​400 మిసైళ్లు

రష్యా నుం చి ఆయుధాలు కొనొద్దని ఓ పక్క అమెరి కా ఆంక్షలు పెడుతోంది. అయినా కూడా కొనాలనే ఇండియా డిసైడ్ అయింది. అవడం కాదు, 2023 నాటికి రష్యా ఫస్ట్ బ్యాచ్ ఎస్ 400 ట్రయంఫ్ మిసైళ్లను ఇండియాకు డెలివరీ చేయనుంది. తొందర్లోనే దానికి సంబంధిం చిన పేమెంట్స్​ కూడా అందుతాయని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ‘‘2023 నాటికి ఫస్ట్ బ్యాచ్ మిసైళ్లను ఇండియాకు డెలివరీ చేస్తాం ” అని రష్యా ఎంబసీ,డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబూష్కిన్ చెప్పారు. రూ.37,304 కోట్ల (520 కోట్ల డాలర్ల) విలువైన డీల్ కు సంబంధించి త్వరలో ఇండియా 20 శాతం పేమెంట్స్​ చేస్తుందని రష్యా ట్రేడ్ కమిషనర్ యారోస్లావ్ టారాశూక్ చెప్పారు. తొలి పేమెంట్ అందగానే మిసైళ్లను ఇండియాకు పంపిస్తామన్నారు. ఆ తర్వాత మిగతా నాలుగు మిసైళ్లను అందిస్తామన్నారు. న్యూఢిల్లీలో ఉన్న రష్యాకు చెందిన షెర్ బ్యాంక్ బ్రాంచ్ లో ఇండియా మిసైళ్లకు డబ్బులు చెల్లిస్తుంది. అయితే, మారిన పేమెంట్ ఒప్పందం ప్రకారం రూపాయల్లోనే రష్యాకు ఇండియా డబ్బులు చెల్లించనుంది.

ఇండియాలో బ్రాంచ్ ఉన్న మరో రష్యా బ్యాంక్ వీటీఎం కూడా ఈ పేమెంట్స్​ను చూసుకుంటుంది. ఎస్ 400 మిసైళ్లతో పాటు 200 కమోవ్ కేఏ 226టీ తేలికపాటి హెలికాప్టర్లనూ ఇండియా కొనబోతోంది. అయితే, ఆర్డర్ ను త్వరగా పెట్టాలని రష్యా కోరుతోంది. నిజానికి ఏడాది క్రితమే డీల్ కుదిరినా ఆర్డర్ పెట్టడం లేట్ అవుతోంది. డీల్ విలువ ₹7,173 కోట్లు (వంద కోట్ల డాలర్లు). అమెరికా వద్దంటున్నా …ఈ డీల్స్​పై మొదట్నుంచి అమెరి కా గుర్రుగానే ఉంది. ఒకవేళ రష్యా నుంచి గానీ ఆయుధాలు కొంటే ఆంక్షలు తప్పవని ఇండియాను బెదిరిస్తోంది. క్యాట్సా (కౌంటరిం గ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్​ యాక్ట్ ) ప్రకారం ఆంక్షలుంటాయని హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా చైనాపై దాన్ని ప్రయోగించింది. టర్కీపైనా ప్రయోగించేందుకు రెడీ అవుతోంది.

అయినా ఇండియా ముందుకే వెళుతోంది. ఇటీవలే మాస్కోలో ఆదేశ విదేశాంగ మంత్రి సెర్జె లావ్రోవ్ తో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశమయ్యారు. వ్లాది వోస్తో క్ లో జరిగే ఈస్టర్న్​ ఎకనామిక్ ఫోరం సదస్సు కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లనున్నారు. సెప్టెం బర్ 4 నుం చి 6 వరకు అక్కడే ఉంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ తో సమావేశమవుతారు. ఆ తర్వాత కొన్ని వారాలకే అమెరికా అధ్యక్షుడు, ఆ దేశ విదేశాం గ మంత్రితో ప్రధాని మోడీ, జయశంకర్ సమావేశం కానున్నారు.

Latest Updates