రూ.130+కోట్లు.. సాహో తొలిరోజు కలెక్షన్ల సునామీ

ప్రభాస్ సాహో సినిమా తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచమంతటా భారీగా కలెక్షన్లు రాబట్టింది. సాహో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని.. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సాహో వసూళ్లకు బ్లాక్ బస్టర్ బిగినింగ్ వచ్చిందని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెలిపింది.

మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని యూపీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.53కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ తెలిపారు. హిందీలో రూ.32కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, కర్ణాటకలో రూ.12 కోట్లు, కేరళలో రూ.1.2కోట్లు కలిపి.. ఓవరాల్ గా ఇండియాలో తొలిరోజు రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చెప్పారు. ఓవర్సీస్ లో కలుపుకుని.. ఫస్ట్ డే గ్రాస్ తో రికార్డ్ కలెక్షన్లు వసూలైనట్టు యూవీ క్రియేషన్స్ చెబుతోంది.

Latest Updates