సాహో.. రికార్డులు దాటలేకపోయింది

సాహో..ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి రిలీజ్ వరకు ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు అన్నీఇన్ని కావు. బాహుబలి హిట్ తర్వాత మూవీ కావడంతో అంతకు మించి హోప్స్ పెట్టుకున్నారు. అయితే రిలీజ్ ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న సాహో… ఇక కలెక్షన్ల పరంగా చూసినా పెద్ద షాకే ఇచ్చింది సోహో.

నాన్ బాహుబలి రికార్డులతో పోలిస్తే.. ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి, ఖైదీ నంబర్ 150, స్పైడర్ సినిమాల కలెక్షన్లను అందుకోలేక పోయింది. సీడెడ్ లో ఒక్క రోజు కలెక్షన్లలో వినయ విధేయ రామ రూ.7.62 కోట్ల కలెక్షన్ క్రాస్ చేయలేక పోయింది. ఫస్ట్ వీక్ కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ అరవింద సమేత రూ.13.08 కోట్లను కూడా సాహో అందుకోలేక పోయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటించగా.. సుజీత్ డైరెక్టర్.

Latest Updates